![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -251 లో.... ఇషిక, వీరులతో పెద్దసారు మాట్లాడడం రుద్ర చూస్తాడు. అందరి గురించి ఆలోచిస్తావ్.. నీ గురించి కూడా ఆలోచించాలి కదా అని పెద్దసారు అంటాడు. మరొకవైపు లక్ష్మీ, పైడిరాజు మాట్లాడుకుంటారు. ఈ రోజు అకాడమీలో గంగ సర్ ని కలిసింది. వాళ్లకి ఇది వరకే పరిచయం ఉందట కోపంగా మాట్లాడుకున్నారని లక్ష్మీతో పైడిరాజు అంటాడు. గంగ వాళ్ళ కూతురే అని త్వరలోనే తెలుస్తుందని లక్ష్మీ అంటుంది. అప్పుడే గంగ, రంగా వస్తారు. నువ్వేంటి ఇక్కడికి వచ్చవని లక్ష్మి అడుగుతుంది. మీరు ఈ ఇంట్లో ఎలా ఉన్నారని చూడడానికి వచ్చామని గంగ అంటుంది.
అయిన గంగ వాళ్ళ కూతురే అని అంటున్నారేంటి అని గంగ అనగానే.. అదేం లేదమ్మ గంగ మా కూతురు అని అమ్మాగారికి తెలిసిందని చెప్తున్నానని లక్ష్మి కవర్ చేస్తుంది. ఎలా వచ్చావని లక్ష్మీ అడుగుతుంది. గోడ దూకి వచ్చానని గంగ చెప్తుంది. అప్పుడే సుధా వస్తుంది. గంగని చూసి ఎలా వచ్చావని అడుగుతుంది. గోడ దూకి వచ్చామని గంగ చెప్తుంది. మరొకవైపు రాత్రి పార్టీ నుండి స్నేహ ఇంటికి రాలేదని ఇందుమతి టెన్షన్ పడుతుంది. తన ఫ్రెండ్స్ కి వంశీ, సూర్య కాల్ చేసి అడుగుతారు. ఎవరు కూడా రాలేదని చెప్తారు. వాళ్ళు కంగారుగా మాట్లాడుకోవడం ఇషిక వింటుంది.
ఆ తర్వాత శకుంతల, పెద్దసారుకి స్నేహ లేదన్న విషయం తెలిస్తే కోప్పడుతారని వాళ్లకి తెలియకుండా ఉండాలని స్నేహ గురించి ఇందుమతి వాళ్ళు రుద్రకి చెప్తారు. సరే నేను చూసుకుంటానని రుద్ర వెళ్తాడు. ఆ తర్వాత ఈ విషయం వీరుకి ఇషిక చెప్తుంది. ఇదంతా నీ ప్లాన్ అనుకుంట కదా బ్రో అని ఇషిక అనగానే లేదని వీరు అంటాడు స్నేహని లవ్ ట్రాక్ లో పడేయ్యమని రోహిత్ కి వీరు చెప్తాడు. అతను ఏదైనా చేసి ఉంటాడు అని రోహిత్ కి వీరు ఫోన్ చేసి అడుగుతాడు. నాకు తెలియదని రోహిత్ అంటాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకి తెలిసేలా చేయాలని ఇషిక, వీరు అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |